07-05-2025 07:02:18 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థులు ఇష్టంతో చదివి ఉత్తమ జీవితానికి బాట వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లాలో మైనారిటీ గురుకుల విద్యార్థులు ఇటీవల ప్రకటించిన పడవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధించిన విద్యార్థులను తన ఛాంబర్ లో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు సాధించిన ఉత్తమ విజయాలతో స్ఫూర్తి పొంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విజయాలకు కారకులైన జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, ఆర్.ఎల్.సి., ప్రిన్సిపాల్, అధ్యాపక, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.
జిల్లా మంచి పేరు తీసుకోవచ్చినందుకు వారి సేవలను కొనియాడారు. కామారెడ్డి మైనారిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు రెండవ సంవత్సరం బైపీసీలో జబ్రాన్ అలీ 991/1000 మార్కులతో రాష్ట్ర స్థాయి 7వ ర్యాంక్, ఆఫ్రోజ్ 987/1000 మార్కులతో 11వ ర్యాంక్ సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో బైపీసీ బాన్సువాడ జూనియర్ కళాశాల విద్యార్థులు తవూర 435/440 మార్కులతో రాష్ట్ర 4వ ర్యాంక్, ఆఫ్తాబ్ 432/440 మార్కులతో రాష్ట్ర స్థాయి 7వ ర్యాంక్, ఎంపీసీలో సాత్విక, రాంచరణ్ 461/470 మార్కులతో రాష్ట్ర 7వ ర్యాంక్ సాధించారని వివరించారు. పదవ తరగతి విద్యార్థులు నిక్షయ్ 581/600, రాహుల్ 575/600 మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్, ఆర్.ఎల్.సి. కిరణ్ గౌడ్, ప్రిన్సిపల్స్ ఇంతియాజ్ అలీ, వెంకటరాములు, ధనలక్ష్మి, అధ్యాపకులు పాల్గొన్నారు.