ఎస్ఐఅర్ పై బీఎల్ఓలు, పార్టీల ప్రతినిధుల సమావేశం
08-07-2026 06:48 PM
బేల,(విజయక్రాంతి): మండల ఎంఆర్ఓ కార్యాలయంలో బీఎల్ఓలు (Booth Level Officers) వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్వపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం, కొత్త ఓటర్ల నమోదు, పేర్లు, చిరునామా మార్పులు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు తదితర అంశాలపై అధికారులు వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరారు. పారదర్శకంగా, నిబంధనల ప్రకారం ఓటరు జాబితా రూపొందించేందుకు బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో బీఎల్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






