8 July, 2026 | 6:24 PM

ఇంటింటికి మొక్కలు నాటండి

08-07-2026 05:42 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వ పరంగా పంపిణీ చేస్తున్న మొక్కలను ప్రతి ఇంటికి నాటాలని బూతు గ్రామపంచాయతీ సర్పంచ్ అన్నపూర్ణా మహేందర్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీసుకున్న మొక్కలను తప్పనిసరిగా నాటాలని ఒక మొక్క ఇంటిల్లిపాదికి ఆక్సిజన్ అందిస్తున్న అన్నారు. మొక్కల రక్షణతో వాతావరణ సమతుల్యాన్ని కాపాడినట్టు అవుతుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ మెరుగు భోజన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు భార్య నాగేందర్ సన్నీ రెడ్డి  సాయన్న గ్రామ కార్యదర్శి జాదవ్ అశోక్ టెక్నికల్ అసిస్టెంట్ మధు బోత్ పట్టణ వార్డు సభ్యులు కట్కూరి సాయి మేడిచర్ల ప్రవీణ్ పద్మారావు కాలనీవాసులు పాల్గొన్నారు.