19-01-2026 12:31:20 AM
మర్రిగూడ:* జనవరి 18 : యువత చదువుతోపాటు క్రీడలపై కూడా దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు యువకుల మధ్య స్నేహ భావాలు పెంపొందించడమే కాకుండా ఐకమత్యానికి దోహదపడతాయన్నారు.
ఆటల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు స్ఫూర్తిగా కోరుకుంటూ స్నేహభావంతో మెలగాలని సూచించారు. అనంతరం సర్పంచ్ సంతోష్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ ముత్యాలమ్మ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఇక నుంచి ప్రతి ఏట మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, రాష్ట్ర నాయకులు అనంతరాజు గౌడ్, వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్,సర్పంచ్లు కమ్మ చిచ్చు వెంకటేష్, ఆమ్బోతు సీతారాం నాయక్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.