calender_icon.png 19 January, 2026 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిక కుల సంఘం అభివృద్ధికి కృషి

19-01-2026 12:32:48 AM

పెరక సంఘం నాయకులు కీత మట్టయ్య 

గరిడేపల్లి, జనవరి 18 : పెరికకుల సంఘం బలోపేతానికి కృషి చేస్తామని పెరిక కుల నాయకులు కీత మట్టయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన పెరికకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెరికకుల సంఘాన్ని చైతన్యవంతం చేస్తూ కులంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక చేయూతనందిస్తూ ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు.

అనంతరం పెరిక కుల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా గుండు సైదు లు, ఉపాధ్యక్షులుగా కీత రామానాధం, ప్రధాన కార్యదర్శిగా సుందరి సత్యనారాయణ,కోశాధికారిగా జుట్టుకొండ వెంకటే శ్వర్లు (జె.వి),ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ముత్తినేని కిరణ్ మరియు పెఱిక సంఘం యూత్ అధ్యక్షులు గా జుట్టుకొండ రాకేష్,ఉపాధ్యక్షులు కీత సాయికుమార్,ప్రధాన కార్యదర్శి ముత్తినేని లక్ష్మీనారాయణ,కోశాధికారి ఇండ్ల వెంకటేష్, ఆర్గనైజర్ సెక్రెటరీ కీత నవీన్,

జాయింట్ సెక్రెటరీ గుండు శివ తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిత్తలూరి వీరస్వామి,పెఱిక సంఘం కుల పెద్దలు కీతమట్టయ్య,కీత రామారావు, కీత నాగరాజు,కోటేశ్వరరావు, రాములయ్య, కీతా శ్రీనివాస్,వెంకన్న,రామకృష్ణ,శ్రీనివాస్,సర్వేషం,బిక్షం,హరిబాబు,నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.