13 March, 2026 | 4:44 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మంజూరు పత్రం అందజేత

13-03-2026 03:42 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం నాగిరెడ్డిపేట్ మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలో లబ్ధిదారులు భయమొల్ల కాంతమ్మకు గ్రామ సర్పంచ్ మన్నే వెంకటి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మన్నె వెంకట్ మాట్లాడుతూ...నిరుపేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.కావున పేదప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈయొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు చేపట్టి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

అనంతరం లబ్ధిదారులు భయమొల్ల కాంతమ్మ పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకురావడం పూర్వజన్మల సుకృతమన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కార్తీక్,గ్రామ పెద్దలు లక్ష్మణ్ ఠాగూర్,హనుమాన్లు, సాయ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.