calender_icon.png 19 January, 2026 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ బోధన.. భవితకు నిచ్చెన

19-01-2026 12:30:36 AM

-ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

-ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష...

మంచిర్యాల, జనవరి 18 (విజయక్రాంతి) : ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూల్స్) ముందుంటున్నా యి. ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేటు స్థాయి విద్య అందించడమే కాకుండా అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తుండటం, ఖర్చు లేకుండా ఉత్తమ విద్య అందుతుండటంతో చేరేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. 20 26-- విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ౬వ తరగతిలో ప్రవేశాలు, ఏడు నుంచి పదో తరగతి వరకు ఆయా పాఠశాలల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆదర్శ పాఠశాలల్లో విద్యా బోధన ఉత్తమంగా ఉండటంతో చేరేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు.ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికయ్యేలా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఐదు మోడల్ పాఠశాలల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్‌లో గల మోడల్ స్కూల్‌తో పాటు దండేపల్లి మండలంలోని లింగాపూర్ మోడల్ స్కూల్, మందమర్రి, కాసిపేట, కోటపల్లి మం డల కేంద్రాల్లోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఒక్కో పాఠశాలలో ౧౦౦ సీట్లతో పాటు ౭ నుంచి ౧౦వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

28 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరవ తరగతిలో పూర్తి ప్రవేశాలు, ఏడు నుంచి పదో తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆరవ తరగతిలో చేరే విద్యార్థులకు ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ విద్యార్థులు రూ.200, వికలాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ. 125 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు వెబ్ సైట్ (https://tgms.telanga na.gov.in) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వీరు అర్హులు...

ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరవధికంగా 4, 5 తరగతులు చదివిన వారై ఉండాలి. 2025 ఐదవ తరగతి చదువుతూ పై తరగతికి అర్హత పొందిన వారై ఉండాలి. వంద మార్కులకు రాత పరీక్ష ఇంగ్లీ ష్, తెలుగు మీడియంలో ఉంటుంది. ఇందు లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరవ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. ఎంపికకు ఆదాయ పరిమితి నిబంధన లేదు. అల్పాదాయ వర్గాల (ఈబీసీ) వారికి ప్రాధాన్యమిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు...

-ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో https:// tgms.telangana.gov.in, www.telangana ms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

-హాల్ టికెట్లు ఏప్రిల్ 9వ తేదీలోపు డౌన్ లోడ్ చేసుకోవాలి.

-ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష (6వ తరగతికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతులకు మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

-మే నెలలో విద్యార్థుల మెరిట్ జాబితా ప్రచురణ, సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.

సద్వినియోగం చేసుకోవాలి 

ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో ఆరవ తరగతి, పై తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల ను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. కార్పొరేటు స్థాయిలో విద్యా మోడల్ స్కూళ్లలో అందుతోంది. మధ్యాహ్నా భోజనంతోపాటు, ఉచిత పాఠ్యపుస్తకాలు అందజే యడం జరుగుతుంది. ప్రతి ఏడాది మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఆసక్తి గల విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలి.

 ముత్యం బుచ్చన్న, ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్, మంచిర్యాల