18 April, 2026 | 2:21 AM

పీఆర్సీతో పాటు సమస్యలూ పరిష్కరించాలి

18-04-2026 12:00 AM

అబ్కారీశాఖ భవన్‌లో ఉద్యోగుల నిరసన 

హైదరాబాద్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): తెలంగాణ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు పెన్షనర్లకు ప్రభుత్వం వెంటనే పీఆర్సీతోపాటు నెలకొన్న ఇతర సమస్యలను పరిష్కారించాలని అబ్కారీ శాఖ ఉద్యో గులు ప్రభుత్వాన్ని కోరారు. టీజీఈజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం అబ్కారీ భవన్‌లో పనిచేసే ఉద్యోగులు, ఎక్సైజ్ యూ నియన్లు కలిసి భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.