18 April, 2026 | 2:19 AM

అనాథ చిన్నారులకు చేయూత

18-04-2026 12:00 AM

భరోసా ఇచ్చిన డాక్టర్ మహేష్ రెడ్డి  

ముకరంపుర,ఏప్రిల్ 17(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని చాకుంట గ్రామానికి చెందిన ఇద్దరు అనాథ చిన్నారులను ఆదుకునేందుకు కరీంనగర్ వన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మర్రి మహే ష్‌రెడ్డి ముందుకొచ్చారు.తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆదిత్య, శ్రీనివాస్ అనే ఇద్దరు సోదరుల దైన్య స్థితిని తెలుసుకున్న ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు.

బాధితుల ఇంటికెళ్లి వారి పరిస్థి తిని సమీక్షించిన డాక్టర్, ఆ పిల్లల పూర్తి విద్యా, వైద్యఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న చిన్నారులను అక్కున చేర్చుకున్న డాక్టర్ మహేష్ రెడ్డి ఉదారతపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల పట్ల చూపిన ఈ మాన వతా దృక్పథం సమాజంలో సానుకూల సందేశాన్ని పంపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మర్రి మహేష్ రెడ్డితో పాటు సర్పంచ్ పురం రాజేశం మాధవి, ఉపసర్పంచ్ చంద్ర శేఖర్,సురేష్ పాల్గొన్నారు.