calender_icon.png 15 June, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మలేరియా నివారణకు ఆల్ఫా సైఫిర్ మిత్రిన్ పిచికారీ

14-06-2025 12:23:13 AM

టేకులపల్లి, జూన్ 13 (విజయక్రాంతి):జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ ఆదేశంతో టేకులపల్లి మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బిసి బాలుర ఆశ్ర మ పాఠశాల, కస్తూరి బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల, పోస్ట్ మెట్రిక్ గరల్స్ హాస్టల్, బీసీ బాలుర హాస్టల్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, కోయగూడెం ఆశ్రమ పాఠశాల, గం గారం ఆశ్రమ పాఠశాలలు, గొత్తి కోయ గుంపులు ఉన్న సిద్ధారం, మోట్లగూడెం, నాగారపుజోగు గ్రామాలలో మలేరియా నివారణకు తీసుకునే ముందస్తు చర్యలలో భాగంగా గృహముల్లో ఆ ల్ఫా సైఫిర్ మిత్రిన్ అనే మందును శుక్రవారం పిచికారి చేశారు.

ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశు భ్రత, పరిసరాల పరిశుభ్రత, దోమ విజృంభించకుండా - కుట్టకుండా, సీజనల్ వ్యాధులపై ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది స్వప్న, సులోచన, మానస, అరుణ కుమారి, స్రవంతి, ధనసరి రాంబాబు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.