23 June, 2026 | 11:20 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఆల్ఫా మళ్లీ వాయిదా

10-03-2026 12:00 AM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన ఇన్‌స్టాలో పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘#ALPHA 10.07.2026 థియేటర్లలో కలుద్దాం‘ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రమే ‘ఆల్ఫా’. ఈ సినిమాలో అలియాతోపాటు శార్వరి వాఘ్, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ది రైల్వే మెన్’ సిరీస్‌ను తెరకెక్కించిన శివ్ రవైల్ దర్శకత్వం వహిన్నారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మహిళా ప్రాధాన్య స్పై థ్రిల్లర్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే, కొన్ని నెలలుగా ఈ సినిమా విడుదలపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సల్మాన్‌ఖాన్ సినిమాతో తలపడటం ఇష్టం లేక అలియా భట్ తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నింటికీ తెర దించుతూ ‘ఆల్ఫా’ టీమ్ తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది.

మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అధికారిక ప్రకటన ప్రకారం ఈ చిత్రం జూలై 10న థియేటర్లలో విడుదల కానుంది. మొదట ఈ సినిమాను 2025 క్రిస్మస్ కానుకగా తీసుకురావాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల విడుదల తేదీని ఏప్రిల్ 17గా మార్చారు.

అయితే, అదేరోజు సల్మాన్‌ఖాన్ నటించిన ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ కూడా విడుదలవుతుండటంతోంది. సల్మాన్‌ఖాన్ కోసం ‘ఆల్ఫా’ రిలీజ్ విషయంలో ఆదిత్య చోప్రా ఒక అడుగు వెనక్కి వేశారని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాక్సాఫీస్ క్లాష్ వల్ల సినిమాల వసూళ్లపై ప్రభావం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.