14 July, 2026 | 10:09 AM

కోట్ల విలువైన ఆల్ఫాజోలం, గంజాయి దహనం

30-08-2024 12:33 AM

సంగారెడ్డి, ఆగస్టు 29 (విజయక్రాంతి): కొద్దిరోజులుగా వాహన తనిఖీలు, సోదాలు చేసి పట్టుకున్న రూ.3.75 కోట్ల విలువైన 13 కిలోల ఆల్ఫాజోలం, 950 కిలోల ఎండు గంజాయిని గురువారం ఎస్పీ చెన్నూర్ రూపేష్ ఆదేశాల మేరకు పోలీసులు పాశామైలారం పారిశ్రామిక వాడలో దహనం చేశారు. ప్రక్రియను అదనపు ఎస్పీ సంజీవరావు, మెడీకేర్ పరీశ్రమ మేనేజర్ శివారెడ్డి, పటాన్‌చెరు,సంగారెడ్డి డీఎస్పీలు పాల్గొన్నారు.