22-01-2026 12:05:29 AM
కొత్తపల్లి, జనవరి 21(విజయక్రాంతి): కొత్తపల్లి పట్టణం లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువంటి ‘అల్ఫోర్స్ ఖేల్ కి మస్త్‘ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు ఎన్నో లాభాలు చేకూర్చడమే కాకుండా వారికి చ దువు పట్ల ఆసక్తిని పెంపొందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు.
మన భారత దేశంలో క్రీడా రంగానికి ఎనలేని ప్రాముఖ్యత ఉన్నదని మరియు చాలామంది క్రీడారంగంలో రాణించడం ద్వారా విజేతలగా ఉన్నారని అన్నారు.వేడుకలలో భాగంగా విద్యార్థులకు ఫుట్ బాల్, వాలీబాల్, ఖో-ఖో, కబడ్డి, స్కిప్పింగ్, చెస్, క్యారమ్స్ మరియు తదితర పోటీలను ని ర్వహించడం జరిగింది.అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులను త్వరలో నిర్వహించే ప్రత్యేక వేడుకలో ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.