22-01-2026 12:06:25 AM
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్, జనవరి 21 (విజయక్రాంతి) : మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యు లు వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడారు. మహిళలకు పావలా వడ్డీకి రుణాలు అందజేయడం మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, పెట్రోల్ పంపులు మంజూరు చేయడం, షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించడం, మహిళలకు స్వ యం ఉపాధి పథకాలు ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నమన్నారు.
మహిళలను అన్ని రకాలుగా ప్రజా ప్రభు త్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వా రా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రమాకాంత్, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, ఎమ్మార్వో సుజా త, సివో రవీందర్,సివో శ్రావతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం,మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షు లు దోనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు.