29 July, 2026 | 1:03 AM

రైతుల ఆదాయాన్ని పెంచడం కోసమే ప్రత్యామ్నాయ పంటలు సాగు

29-07-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, జూలై 28 (విజయక్రాంతి): రైతుల ఆదాయాన్ని పెంచడం కోసమే ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలని రైతులకు సూచిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు  వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ లో రైతులకు వరి పండించకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు అవగాహన కల్పించారు. రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ కమిషనర్, అగ్రికల్చర్ డైరెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.

రైతు నేస్తం కార్యక్రమం విజయవంతంగా 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకుందన్నారు. ప్రతి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడు తున్న కార్యక్రమం అన్నారు.  కామారెడ్డి జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది కూడా వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్నారు. శాస్త్రీయ అంచనాలు సూచిస్తున్నాయని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో రైతులు కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా పెసర్లు, కందులు, మినుములు, నూనెగింజల పంటలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు తదితర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  ఎన్.వై. గిరి, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.