calender_icon.png 19 January, 2026 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

19-01-2026 09:28:59 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండలంలోని తిమ్మాపురం జెడ్పీహెచ్ఎస్ లో 2010 - 11 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం పాఠశాలలో అందరూ ఒకే వేదికపై కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులైన వెంకటేశ్వర్లు, కొమిరెల్లి, వెంకట్ రెడ్డి, వసీఉల్లా, శ్రీనివాస్, చైతన్య, రాణి, పద్మజారాణి, శ్రీనివాస్, రమేష్, రవిలను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.

అనంతరం పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ... విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తించుకొని ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు.ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే తల్లిదండ్రులతో పాటు విద్య నేర్పిన గురువులకు గుర్తింపు ఉంటుందన్నారు. అధ్యాపకుల ప్రసంగాలతో భావోగ్వేగంగా సాగిన ఈ కార్యక్రమం విద్యార్థుల సందడి,డాన్సులతో ముగిసింది.