12-10-2025 06:01:56 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): మండలంలోని పద్మావతి వాడి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాలలో 2008-09 పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఒకరినొకరు పలకరించుకొని రోజంతా హాయిగా గడిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వీవి రమణ, అబ్బయ్య, వీణ, మినాకుమారి, సబితా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.