calender_icon.png 12 October, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు సముచిత స్థానం కల్పించాలి

12-10-2025 05:58:42 PM

వరంగల్ ఉమ్మడి జిల్లాలో 3 జిల్లాల అధ్యక్షులు బీసీలకు కేటాయించాలి..

బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్..

హనుమకొండ (విజయక్రాంతి): టీపీసీసీ త్వరలో చేపట్టబోయే డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సార్వత్రిక ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ను అమలు చేసే దశలో భాగంగా సంస్థాగతంగా నిర్వహించబోయే కాంగ్రెస్ పార్టీ పదవులను కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం కేటాయించాలన్నారు.

రాష్ట్రంలో 33 జిల్లాలలో నియమించబోయే డీసీసీ అధ్యక్ష పదవులలో బీసీల జనాభా దామాషా ప్రకారం 17 జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులను బీసీలకు కేటాయించాలని, అదేవిధంగా వరంగల్ ఉమ్మడి 6 జిల్లాల్లో 3 డీసీసీ అధ్యక్ష పదవులను బీసీలకు కేటాయించి, బీసీలకు సముచిత స్థానం కల్పించి, కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలని వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ టీపీసీసీని కోరారు.