కీతవారిగూడెంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
11-05-2026 01:02 AM
గరిడేపల్లి, మే 10 : మండల పరిధిలోని కీతవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విద్యార్థులు 1993 - 94 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాను ఆదివారం ఘనంగా నిర్వహించారు. 32 సంవత్సరాల అనంతరం అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఎక్కడెక్కడో వివిధ హోదాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకొని అలనాటి మధురస్పృతులను గుర్తు చేసుకున్నారు. విద్య నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు అచ్చయ్య, భవాని, వెంకటేశ్వర్లు, సైదాచారి, సైదులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






