calender_icon.png 7 February, 2026 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమనగల్లు ప్రగతి పథం: రూ.163 కోట్లతో అభివృద్ధి లక్ష్యం

07-02-2026 11:34:08 AM

ఆగమైన ఆమనగల్లు ను అభివృద్ధి చేసుకుందాం 

రండి మా చేతికి జత కట్టండి 

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

​ఆమనగల్లు,(విజయక్రాంతి): రాష్ట్రంలోనే  ఆమనగల్ మున్సిపాలిటీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ నిశ్చయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. అమనగల్లు పార్టీ కార్యాలయంలో ఆవరణలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను పీసీసీ కోఆర్డినేటర్  విజయారెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిన ఆమనగల్లును, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ప్రగతి బాట పట్టించామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

గడిచిన రెండేళ్ల ప్రగతి - రాబోయే లక్ష్యాలు..

​మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రజల ముందుంచారు.

* ​రూ.63 కోట్ల అభివృద్ధి.....

గత రెండేళ్ల కాలంలోనే రూ.63 కోట్లతో మున్సిపాలిటీ పరిధిలో వివిధ మౌలిక సదుపాయాల పనులను విజయవంతంగా చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ​మరో రూ.100 కోట్ల నిధుల హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవిల సహకారంతో రాబోయే రోజుల్లో మరో రూ.100 కోట్లు కేటాయించి, ఆమనగల్లు రూపురేఖలు మారుస్తామని భరోసా ఇచ్చారు.

​అధునాతన డ్రైనేజీ వ్యవస్థ: 

పట్టణంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధునాతన 'అండర్ గ్రౌండ్ డ్రైనేజీ' వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన రక్షిత తాగునీటిని అందించడమే కాంగ్రెస్ ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటించారు. మున్సిపాలిటీలోని ప్రతి కాలనీలోనూ అధునాతన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.

మెనీ ప్లేస్ లో ప్రకటించిన ఈ అంశాలను ఆమనగలను ఒక మోడల్ మున్సిపాలిటీగా  మార్చే దిశగా అడుగులని ఎమ్మెల్యే కసిరెడ్డి  ఉద్ఘాటించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గుర్రం కేశవులు, మహేశ్, జగన్, వెంకటరమణారెడ్డి, మండ్లి రాములు, జి.శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, కృష్ణ నాయక్ మరియు ఇతర పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు పాల్గొన్నారు.

​ముఖ్య గమనిక: మేనిఫెస్టోలో ప్రకటించిన ఈ అంశాలు ఆమనగల్లును ఒక "మోడల్ మున్సిపాలిటీ"గా మార్చే దిశగా వేస్తున్న అడుగులని ఎమ్మెల్యే కసిరెడ్డి ఉద్ఘాటించారు.