16 July, 2026 | 11:43 PM

29 నుంచి అమర్‌నాథ్ యాత్ర

17-06-2024 12:18 AM
  • అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం

52 రోజులు సాగనున్న మంచుకొండల యాత్ర

న్యూఢిల్లీ, జూన్ 16: మంచుకొండల్లో ఎంతో సాహసోపేతంగా, అంతకుమించి భక్తిపారవశ్యంతో సాగే అమర్‌నాథ్ యాత్రకు భక్తుల రిజిస్ట్రేషన్లు శనివారం ప్రారంభమయ్యాయి. హిమాలయల్లో 3,880 మీటర్ల ఎత్తులో గుహలో కొలువైన మంచు లింగాన్ని దర్శించుకొనేందుకు భక్తులు దరఖాస్తు చేసుకొంటున్నారు. ఈ నెల 29న ఈ వార్షిక యాత్ర ప్రారంభం కానున్నది. 52 రోజులపాటు సాగే యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ (ఎస్‌ఏఎస్‌బీ) ఆదివారం ప్రకటించింది. ఏటా రెండు మార్గాల్లో ఈ యాత్ర సాగుతుంది. ఒక మార్గం అనంత్‌నాగ్ జిల్లాలోని నున్‌వాన్ మీదుగా 48 కిలోమీటర్ల దూరం నడకదారి ఉంటుంది. గందేర్బల్ జిల్లాలో 14 కిలోమీటర్ల దూరం మరో మార్గం ఉంటుంది. కానీ, ఈ మార్గంలో వెళ్లటం ప్రమాదంతో కూడుకొన్నది. ఈ యాత్రకు రిజిస్ట్రేషన్ ఫీజును రూ.150గా నిర్ణయించారు. ముందుగా వచ్చినవారికే అవకాశం అనే విధానంలో రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి.