21 August, 2026 | 12:13 PM

Breaking News

ఆటోనగర్ ఏర్పాటుకు నూతన కార్యవర్గం ఎన్నిక   •   వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు   •   ఒకే విగ్రహం.. రెండు నివాళులు..! కాంగ్రెస్‌లో మళ్లీ వేడెక్కిన చర్చ   •   కేసముద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో   •   హెచ్.సి.యూలో సీటు సాధించిన విద్యార్థినిని సన్మానించిన సర్పంచ్   •   ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో లబ్ధిదారుల్ని తికమక పెట్టదు   •   అమెరికా పర్యటన కొనసాగించండి... అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం   •   హైదరాబాద్‎కు మాజీ సీఎం జగన్.. భారీగా వెలిసిన కటౌట్లు   •   వరలక్ష్మీ వ్రతం పూజా విధానం, తోరం కట్టే సంప్రదాయం ఇదే!   •   క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం   •  

అమాత్యుడు ఆదేశించారు.. అంచనా పెరిగింది!

23-05-2024 03:58 AM

ఏఎంఆర్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు సర్కిల్ -1 కిస్సా

రూ. 343.35 కోట్ల ప్రాజెక్టును.. రూ.550 కోట్లకు పెంచిన వైనం

భూసేకరణ పూర్తిచేయని ప్రభుత్వం  

కాలపరిమితిని పెంచాలనే ప్రతిపాదనల తిరస్కరణ

అప్పటికే పూర్తయిన రూ.106.42 కోట్ల పనులు

రూ.౨౦ కోట్లకు ఇంకా పూర్తికాని బిల్లులు

కాంట్రాక్టు రద్దు చేస్తే ప్రభుత్వంపై అదనపు భారం

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 22 (విజయక్రాంతి): నల్గొండ జిల్లా ప్రజల దశాబ్దాల కల ఏఎంఆర్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా దేవరకొండ, మునుగోడు ప్రాంతాలను ససశ్యామలం చేయాలనే సంకల్పంతో చేపట్టిన ఆ ప్రాజెక్టు పనులు ఉమ్మడి రాష్ట్రంలో ధనయజ్ఞంగా మారితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అంచనాలు పెరిగాయి కానీ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రెండు దశాబ్దాలుగా అనేక దశలుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టులో ప్రధానమైన ఘట్టం ఏఎంఆర్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు సర్కిల్  అగ్రిమెంట్ 2014 అక్టోబర్ 15వ తేదీన జరిగింది.

ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును క్రాంతి  స్వప్న  శ్రీసత్యసాయి (జేవీ) సంస్థ రూ.343.35 కోట్లకు దక్కించుకుంది. వాస్తవానికి ఈ విలువ ప్రభుత్వ అంచ నా కంటే సుమారు 25.30శాతం తక్కు వ అయినప్పటికీ సదరు కాంట్రాక్టర్ ఎం.సురేశ్‌కుమార్‌రెడ్డి పనులను ప్రారంభించారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పునరావాసం వంటి  కారణాల వలన పనులలో పెద్దగా పురోగతి సాధించలేకపోయారు. కానీ దాదాపు రూ.106.42 కోట పనులను కాంట్రాక్టర్ పూర్తి చేయగా,ప్రభుత్వం రూ.20కోట్ల పనులకు బిల్లు చేయాల్సి ఉంది.

ప్రభుత్వంపై అదనపు భారం...

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచితే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని సదరు కాంట్రాక్టర్ పేర్కొంటున్నారు. తనకు రూ.300 కోట్ల వరకు క్లయిమ్‌లను, నష్టాన్ని చెల్లించాల్సి ఉంటుందని, అలాగే కొత్త కాంట్రాక్టర్ టెండర్ వేస్తే అదనంగా రూ.75 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని కాంట్రాక్టర్ తెలిపారు.  స్థానిక మంత్రి ఆదేశాలతో జరిగిన చర్యలతో తామ కాంట్రాక్టు సంస్థ తీవ్రంగా నష్టపోయిందని, ఈవోటీ ద్వారా తమకు పనులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, ఏఎంఆర్ కాంట్రాక్టర్ పనిని అమలు చేయడానికి అనుమతించాలని   ప్రస్తుత ప్రభుత్వాన్ని సదరు కాంట్రాక్టర్ కోరుతున్నారు. అలాగే ప్రస్తుత రేటులో 15% తక్కువ రేట్ల ప్రకారం తమకు పనులు అప్పగిస్తే నిర్ణీత కాలంలో పనులను పూర్తి చేస్తామని, తద్వారా తమకు న్యాయం జరగడంతో పాటు ప్రభుత్వంపై అదనపు భారం పడదని కాంట్రాక్టర్ తెలిపారు. ఈ విషయమై ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

కాలపరిమితిని పెంచాలని అభ్యర్థన

అయితే భూ సేకరణ ప్రక్రియలో జరిగిన జాప్యం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ కాలపరిమితిని పెంచాలని అధికారులతో పాటు ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ అభ్యర్థించారు. అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు లిఖితపూర్వక దరఖాస్తులు కూడా కాంట్రాక్టర్ సమర్పించారు. కానీ ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించిన స్థానిక మంత్రి పనులలో జరుగుతున్న జాప్యాన్ని ఎరగా చూపి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచాలని ఒత్తిడి తెచ్చారు.

ఆ అమాత్యుడి ఆదేశాలతో, తమకు కాలపరిమితి పొడిగించకపోగా రూ.343.35 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ప్రస్తుత ధరలతో కలిపి గత ప్రభుత్వం కొత్తగా రూ.550 కోట్లకు పెంచి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారంపై కోర్టులో ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో జరిగిన జాప్యం నేపథ్యంలో తమకు పొడిగింపు ఇవ్వకుండా కాంట్రాక్టు రద్దుకు సిఫార్సు చేసి టెండర్లు పిలవాలని కింది స్థాయి అధికారులు స్టాండింగ్ కమిటీని తప్పుదోవ పట్టించారని సదరు కాంట్రాక్టర్ తెలిపారు.