ఆసిఫాబాద్‌లో అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభం
యూబీవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం యూబీవై (UBY) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రారంభించారు. యూబీవై ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉబెద్ బిన్ యహియా (తారిఖ్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఎండల నేపథ్యంలో బాటసారులు మరియు సామాన్య ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో అంబలి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి కాలంలో అంబలి పంపిణీ చేయడం మంచి సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రతి ఏడాది వేసవిలో అంబలి పంపిణీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఉబెద్ బిన్ యహియా (తారిఖ్) సేవాభావాన్ని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో ఇలాంటి మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగాలని వారు ఆకాంక్షించారు.






