14 April, 2026 | 6:44 PM

అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అట్టడుగు ప్రజలు అభివృద్ధికి నోచుకున్నారు

14-04-2026 03:02 PM

బోథ్: బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల అతడు వర్గాల ప్రజల అభివృద్ధికి నోచుకోవటం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు. మంగళవారం బజార్ రత్నూరు మండల కేంద్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమానత్వం న్యాయం స్వేచ్ఛ వంటి విలువలను అందించిన మహానీయుడు అన్నారు ఆయన రూపొందించిన రాజ్యాంగం ఎంతో గొప్పదన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు వివిధ రాజకీయ పార్టీల వారు పాల్గొన్నారు.