వై జంక్షన్ వద్ద హైమాస్ట్ ఫ్లడ్ లైట్ ఏర్పాటు
ఎస్‌డీఎఫ్ నిధులతో లక్ష రూపాయల వ్యయంతో నిర్మాణం – గ్రామ ప్రజల హర్షం
కోనరావుపేట జూన్ 17 (విజయక్రాంతి): గ్రామ ప్రజల సౌకర్యార్థం, రాత్రి వేళల్లో మెరుగైన వెలుతురు కల్పించాలనే ఉద్దేశంతో జై సేవాలాల్ భూక్యా రెడ్డి పరిధిలోని గ్రామంలోని వై జంక్షన్ వద్ద హైమాస్ట్ ఫ్లడ్ లైట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గురువారం సాయంత్రం నిర్వహించబడింది.ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో ఎస్‌డీఎఫ్ నిధుల ద్వారా సుమారు రూ.1 లక్ష మంజూరు కావడంతో ఈ హైమాస్ట్ లైట్ ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు.గ్రామ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రధాన కూడలిలో హైమాస్ట్ ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేయడం వల్ల రాత్రి సమయంలో ప్రయాణికులు, స్థానిక ప్రజలకు మెరుగైన వెలుతురు అందడంతో పాటు భద్రత పెరుగుతుందని, రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానుక సత్యం, ఉప సర్పంచ్ రాజు నాయక్, ఆత్మ కమిటీ సభ్యుడు తిరుపతి, నాగరాజు, అజ్మిన్ పాషా, దేవేందర్, బాల్కర్ రాజు, బానోత్ రాజు, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హైమాస్ట్ ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ నరేష్ నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.






