25 August, 2026 | 3:50 PM

Breaking News

పుట్టినరోజు సందర్భంగా 1,200 మొక్కల నాటకం   •   మండలంలో వనమహోత్సవం కార్యక్రమం.   •   ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిశీలించిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్   •   వన మహోత్సవం వేళ చెట్ల నరికివేత   •   అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి   •   పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి   •   ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్   •   ప్రకృతిని మనం నాశనం చేస్తే.... ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు   •  

పసికందు విక్రయాల ముఠా గుట్టు రట్టు

17-06-2026 03:09 PM

పటాన్ చెరు, జూన్ 17: సంగారెడ్డి జిల్లా రుద్రారంలో పసికందు విక్రయాల ముఠా గుట్టు రట్టు కావడం కలకలం సృష్టించింది. 17 ఏళ్ల మైనర్ బాలికకు పుట్టిన ఆడపిల్లను రూ. 5 లక్షలకు విక్రయించేందుకు కుటుంబ సభ్యులు, ముఠా సభ్యులు ఒప్పందం చేసుకున్నారు. అయితే బాలిక ప్రతిఘటించి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.ఆస్సాంకు చెందిన మైనర్ దంపతులు నివసిస్తున్నారు.

కాన్పు కోసం ఆమె ఆస్పత్రిలో చేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.గర్భవతిగా ఉన్నప్పుడే శిశువును రూ. 5 లక్షలకు విక్రయించేలా బాలిక భర్త, అత్త, మానవ అక్రమ రవాణా ముఠాతో ఒప్పందం చేసుకున్నారు.ప్రసవం అనంతరం బిడ్డను ముఠాకు అప్పగించేందుకు భర్త, అత్త తీవ్రంగా వేధించారు. బాలిక ధైర్యంగా స్పందించి పోలీసులకు సమాచారం అందించింది.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును కాపాడి తల్లికి అప్పగించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠా సభ్యులపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.