ప్రెస్ క్లబ్ లో అంబేడ్కర్ ఘనంగా జన్మదిన వేడుకలు
14-04-2026 03:05 PM
హన్మకొండ,(విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 135 వ జన్మదిన వేడుకలు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. క్లబ్ ఆవరణలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీను, కొడిపెల్లి దుర్గాప్రసాద్ రావు, సహాయ కార్యదర్శులు పొడిచెట్టి విష్ణువర్ధన్, ఈసీ మెంబర్లు వీరగోని హరీష్, సునీల్, అనిల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.




