06-12-2025 02:38:22 PM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్థంతి సందర్భంగా మహబూబ్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీ ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ దృష్టి లేకపోతే నేటి ప్రజాస్వామ్యానికి ఉన్న బలమైన పునాదులు ఏర్పడేవి కాదని, సామాజిక న్యాయం, సమానత్వం, విద్య–ఉపాధుల్లో హక్కులు వంటి విలువలను ఆయన భారతదేశ ఆత్మలో నాటారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం అంబేద్కర్ చూపిన మార్గానికే అనుసరణ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మార్గం సుగమం చేసిన ఆర్టికల్ 3 ను రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ దూరదృష్టిని ఎమ్మెల్యే విశేషంగా ప్రస్తావించారు. మహబూబ్ నగర్‌లో పేద, వెనుకబడిన, అణగారిన వర్గాల సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను మరింత వేగవంతం చేస్తున్నాం. విద్య, వైద్యం, సామాజిక భద్రత—ఈ మూడు ప్రధాన రంగాల్లో బలమైన అడుగులు వేయడం ద్వారా సమానత్వ సమాజం నిర్మాణం అంబేద్కర్ కలను సాకారం చేయడం మా లక్ష్యమన్నారు. డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో కలిసి డిసిసి అధ్యక్షులు ఎం.సంజీవ్ ముదిరాజ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే మన హక్కుల రక్షకుడని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్.పి. వెంకటేష్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం ఇన్‌చార్జ్ గోనెల శ్రీనివాసులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవేజ్, మీడియా ఇన్‌చార్జ్ సిజే బెనహార్, ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, ఐఎన్టీయూసీ రాములు యాదవ్, శాంతన్న యాదవ్, గోపాల్ యాదవ్, నవనీత, ఏర్పుల నాగరాజు, అజ్మత్ అలి, ఫయాజ్, జహీర్, ప్రవీణ్ కుమార్, ముహమ్మద్ రియాజుద్దీన్, అబ్దుల్ హక్, ఫైసల్, చంద్రమోహన్, మోయీజ్, చర్ల శ్రీనివాసులు, పులిజాల రవికిరణ్, వేణుగోపాల్, వెంకటలక్ష్మి, అలీం తదితరులు పాల్గొన్నారు.