2 July, 2026 | 3:59 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

10-03-2026 04:48 PM

రొయ్యూరు పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు

విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలి

రొయ్యూరు గ్రామ సర్పంచ్ కావిరి అర్జున్ 

ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వం పాఠశాలను రొయ్యూరు గ్రామ సర్పంచు కావిరి అర్జున్ సందర్శించారు పాఠశాల ఫరిషారాలను పరిశీలించి విద్యార్థులకు పెట్టె మధ్యాహ్నం భోజనంలో నాణ్యతగా ఉండాలన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేసి పౌష్టికహారం బియ్యం పప్పు బాలామృతం గుడ్లు పాలు వంటి సరుకులు నాణ్యతగా ఉన్నవి పిల్లలకు అందించాలని అంగన్వాడీ రిజిస్టర్ ను పరిశీలిచడం జరిగింది.

ఈసందర్భంగా సర్పంచ్ కావిరి అర్జున్ మాట్లాడుతూ త్రాగునీటి కేంద్రాన్ని, వంటగదిని, భోజనం, స్టోర్ రూమ్, కూరగాయలను క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, అంగన్వాడీ పిల్లల పౌష్టికహారం విషయంలో ఏ చిన్న తప్పు జరిగిన సాహించేది లేదని వారికీ ప్రతిరోజు నాణ్యమైన ఆహారం అందిచాలని అంగన్వాడీ టీచర్స్ నీ పాఠశాల ఉపాధ్యయులని ఆదేశించారు ఈ కార్యక్రమములో వార్డు సభ్యులు కొండగొర్ల తిరుపతి కార్యదర్శి వీరు నాయక్ గ్రామ పెద్దలు తదితరులు పాలుగోన్నారు