06-12-2025 02:41:35 PM
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతిభారత పౌరుడు విధిగా చదవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు.
ఆయన వెంట అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు మేష సతీష్, నేరెళ్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పి కోఆప్షన్ సభ్యులు యూసుఫ్ ఖాన్, మాజీ మున్సిపల్ అధ్యక్ష ఉపాధ్యక్షులు రాజుర సత్యం, అంకం రాజేందర్, నిమ్మల రమేష్ ,కావాలి సంతోష్, షౌకత్ పాషా, నేత శ్యామ్, దేవతి రాజేశ్వర్, జన్నారపు శంకర్, షబ్బీర్ పాష, కిషోర్ నాయక్, అమానుల్లా ఖాన్, జహీర్, తదితరులు ఉన్నారు.