17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పాల్వంచలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 10:46 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో అఖిలభారత ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే సాంబశివరావు పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ,సిపిఎం, సిపిఐ, రాజకీయ పార్టీలతోపాటు ఉపాధ్యాయ కార్మిక కుల సంఘాల నేతలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, సీఐ సతీష్ కుమార్, ఎస్ఐ సుమన్, ఆ సంఘం పట్టణ అధ్యక్షులు కాల్వ ప్రకాష్ రావు, రాష్ట్ర నాయకులు కాల్వ దేవదాస్, గౌరవ అధ్యక్షులు కాల్వ భాస్కరరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, ఎడవెల్లి కృష్ణ, బిఆర్ఎస్ నాయకులు కిలార నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షులు మంతపురి రాజగౌడ్, సిపిఎం నాయకులు దొడ్డ రవి, సత్య, సిపిఐ నాయకులు ఎస్కే షాబీర్ పాషా, బండి నాగేశ్వరరావు, దళిత సంఘం నాయకులు ముళ్ళపాటి రాజేంద్ర కుమార్, కొత్తపల్లి సోమయ్య, దాసరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.