14 April, 2026 | 4:35 PM

తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

14-04-2026 01:04 PM

తల్లాడ,(విజయక్రాంతి): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్న అంబేద్కర్  విగ్రహానికి(Statue of Ambedkar) తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మహనీయుడు గురించి మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య సౌధానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడని దళిత బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు భారత స్వతంత్ర సమరయోధుడు భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  అని వారి ఆశయ సాధనకు మనమందరం కృషి చేయాలని ఈ సందర్భంగా తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి ఎస్సీ సెల్ అధ్యక్షులు తాళ్ల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీను, కేతేపల్లి భాస్కరరావు, గొడుగునూరి లక్ష్మిరెడ్డి, భూక్య అంజయ్య, వెంకటరామయ్య, రేగళ్ల శ్రీను, రాంబాబు నేలవల్లి,తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.