14 April, 2026 | 4:33 PM

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్

14-04-2026 01:18 PM

ఎర్రుపాలెం ఏప్రియల్ 14 (విజయ క్రాంతి): ఎర్రుపాలెం మండలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ప్రజాస్వామిక వాది, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి, రాజ్యాంగ నిర్మాత కలలు కన్నా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం సర్పంచ్ నండ్రు అశ్విని, ఉప సర్పంచ్ ఎస్.కె శభాష్, దేవరకొండ శ్రీనివాసరావు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు, ఎస్ టి సెల్ అధ్యక్షులు గ్రామ వార్డ్ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.