27-10-2025 04:29:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని దివ్యనగర్ లో గల 534 సర్వేనెంబర్ లోనీ ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేయాలని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి స్వామి మాట్లాడుతూ జిల్లా లోని నిరుద్యోగ యువతి యువకులకు ఉపయోగపడే విధంగా జిల్లాకి స్టడీ సర్కిల్ ని కేటాయించాలని వారు కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఈ పురుషోత్తం, ఆకుల రమేష్, మదస్తు భూమేష్, శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.