calender_icon.png 6 December, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగుల మార్గదర్శకుడు అంబేద్కర్

06-12-2025 05:13:06 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బడుగుల మార్గదర్శకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల మహనీయుడి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి, అహ్మద్,భీమేష్,గంధం శ్రీను, చిలువేరు వెంకన్న,నిస్సార్,నారాయణ,జీవన్, వామన్,తదితరులు పాల్గొన్నారు.