06-12-2025 05:11:04 PM
పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే వారు నియామక పత్రం, ఫామ్14, ఎపిక్ కార్డు తీసుకుని తమ స్వంత మండల పరిషత్ అభివృద్ధి అధికారి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి సమర్పించాలని పేర్కొన్నారు. ఆయా రిటర్నింగ్ అధికారులతో పోస్టల్ బ్యాలెట్ వెంటనే జారీ చేస్తారని తెలిపారు. వెంటనే అక్కడే ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.