calender_icon.png 6 December, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం

06-12-2025 05:15:21 PM

బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్..

ఖానాపూర్ (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయాలు సాధించాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఖానాపూర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం, కోసం నిరంతరం పోరాడిన మహానుభావులని ఆయన చూపిన మార్గం పేదలు బడుగు బలహీన వర్గాలకు వెలుగునిచ్చింది అని వారి ఆశయాల సాధనకు అందరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి రాజా గంగన్న, కొక్కుల ప్రదీప్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మేష సతీష్, ప్రవీణ్, అజయ్, మహిపాల్, తదితరులు ఉన్నారు.