ప్రధాని మోదీ నిర్ణయానికి అమిత్ షా మద్దతు
న్యూఢిల్లీ: దేశ యువత సంక్షేమం, ఉజ్వల భవిష్యత్తు మోదీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) గురువారం పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల విచారణ కోసం 'ఫాస్ట్-ట్రాక్ కోర్టుల'ను(fast track courts ) ఏర్పాటు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం ఆ నిబద్ధతకు నిదర్శనమని అమిత్ షా స్పష్టం చేశారు. అంతకుముందు, దేశ యువత సంక్షేమమే తన ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్టులో పేర్కొన్నారు వారి భవిష్యత్తుకు హాని కలిగించడానికి ప్రయత్నించే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
నీట్ (NEET) పరీక్షలో అక్రమాలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) రాజీనామాను డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులు 'సంసద్ చలో' ర్యాలీలో పాల్గొన్న మూడు రోజుల తర్వాత మోదీ యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఆ ర్యాలీ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేసి, బాష్పవాయువు ప్రయోగించడంతో అనేకమంది విద్యార్థులు గాయపడ్డారు. నిరసన ర్యాలీని అడ్డుకునే ప్రయత్నంలో 100 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. నీట్ పేపర్ లీక్ దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని నరేంద్ర మోదీ చెప్పారని, యువత భవితతో ఆడుకోవాలనుకుంటున్నవారికి ప్రధాని మోడీ చర్యలు ఇబ్బందికరంగా మారాయని అమిత్‌షా స్పష్టం చేశారు.






