23 July, 2026 | 3:28 PM

నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి

23-07-2026 02:21 PM

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ 

చిట్యాల పోలీస్ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

భూపాలపల్లి, జూలై 23 (విజయంక్రాంతి): నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లాలో పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించే దిశగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, గురువారం చిట్యాల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు.

కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.