23 July, 2026 | 1:52 PM

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన రాహుల్ గాంధీ, అఖిలేష్

23-07-2026 01:21 PM

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), అఖికేష్ యాదవ్(And Akhilesh Yadav) సహా అగ్ర ప్రతిపక్ష నాయకులు గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను(Lok Sabha Speaker) కలిశారు. ఈ సమావేశంలో టీఎంసీ నేతలు సౌగతా రాయ్, మహువా మొయిత్రాలు కూడా పాల్గొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో, చర్చకు సంబంధించిన తేదీ, వ్యవధిపై చర్చించేందుకు తనను కలవాలని బిర్లా ప్రతిపక్ష నాయకులను కోరారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, ప్రతిపక్షం సూచించే సభ నిబంధనల ప్రకారమే దానికి తాను అనుమతిస్తానని స్పీకర్ చెప్పారు.