11 August, 2026 | 1:46 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

అమిత్ షా ఒక మూర్ఖుడు

25-06-2025 12:00 AM

డీఎంకే ఎంపీ రాజా

చెన్నై, జూన్ 24: డీఎంకే ఎ ంపీ రాజా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక మూర్ఖుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో గెలుపొందిన విధంగానే తమిళనాడులో పాగా వేస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై రాజా మాట్లాడు తూ.. ‘మే ము ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రను చేజెక్కించుకున్నాం. తర్వాత తమిళనాడు’ అ ని అమిత్ షా అన్నట్టు తెలిపా రు.

అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ ఒక్కడే కావడంతో ఆయన్ని ఓడించార ని.. మహారాష్ట్ర, హర్యానాలో నూ మీ ఆటలు సాగాయన్నారు. కానీ ఇది తమిళనాడు.. ఇక్కడ పెరియార్, అన్నాదురై, కరుణానిధితో పాటు ద్ర విడయన్ విశ్వాసాల అండ స్టాలిన్‌కు ఉం దన్నారు. డీఎంకేను ఓడించడం అంత సులు వు కాదని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ద్రవిడ భావజాలానికి భయపడుతుందన్నారు.