02-02-2026 12:00:00 AM
ఏర్పాట్లు పరిశీలించిన నేతలు
నిర్మల్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన కేంద్ర హోమ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ అమిత్ షా నిర్మల్‌కు వస్తున్నట్లు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నేడు రాష్ట్ర ఇంచార్జి అభయ్ పాటిల్ కలిసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సభ ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ ల్యాండింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వపురం లక్ష్మీ నర్సయ్య మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్ బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.