02-02-2026 12:00:00 AM
బీ ఫామ్ దక్కని వారు పోటీకి సై..
పార్టీ అభ్యర్థులకు రెబెల్స్ బెడద
నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు
ససేమిరా అంటున్న అభ్యర్థులు
స్వతంత్రంగానైన పోటీకి సై
రెబెల్స్ రంగంలో ఉంటే కొంప కొల్లేరు
ఆందోళన చెందుతున్న పార్టీల అభ్యర్థులు
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో అదే తీరు..
కామారెడ్డి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారం చేసుకుందామనుకున్న అభ్యర్థులకు రెబెల్స్ బెడద పోరు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా బి ఫామ్ దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే అభ్యర్థులకు రెబెల్సును బుజ్జగించడం మరో ఎత్తు. రెబెల్సు ఉంటే తమ గెలుపును శాసిస్తారని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ సీనియర్ నేతలు బుజ్జగించాలని కోరుతున్నారు.
కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన తమకు అసలు సమయానికి టికెట్ కేటాయించకపోవడం ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం తాము పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన అసలు సమయంలో టికెట్ ఇవ్వకపోవడం పై పలువురు అభ్యర్థులు పార్టీ సీనియర్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ముందు నుంచి టికెట్టు ఇవ్వమంటే తాము ఎందుకు ఖర్చు పెట్టుకునే వారి మని వాపోతున్నారు. పార్టీ సీనియర్ నేతలు ఆలోచించి పార్టీ కోసం కష్టపడ్డ వారికి బీఫామ్ ఇవ్వాలని కోరుతున్నారు.
స్వార్థం కోసం పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ జెండా పట్టుకుని పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన తమను పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ తోపాటు బీఆర్‌ఎస్, బిజెపి పార్టీలో సైతం రెబల్స్ బెడద కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి బిచ్కుంద మున్సిపాలిటీలో ఎన్నికలు జరగనుండడంతో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీఫామ్ మాత్రం కొందరికి ఇచ్చి మరి కొందరికి మొఖం చాటేశారు. దీంతో రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
పార్టీ అభ్యర్థులకు రెబల్స్ బెడద
కాంగ్రెస్, టిఆర్‌ఎస్, బిజెపి అభ్యర్థులకు రెబల్స్ బెడద ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సీనియర్ నేతల వద్ద పార్టీ అభ్యర్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రెబెల్స్ పోటీతో తమ గెలుపును శాసిస్తారని ఆందోళన చెందుతున్నారు. పార్టీ నేతలు రెబలుగా వేసిన అభ్యర్థులకు నచ్చచెప్పి బుజ్జగించి ఉపసంహరించూ కూనేల ప్రయత్నిం చాలని పలు పార్టీల అభ్యర్థులు కోరుతున్నారు. సీనియర్ నేతల చుట్టూ తిరుగుతున్నారు.
రెబెల్‌గా పోటీ చేస్తే గెలుపు కష్టమే
రెబెల్సు తమ వార్డులో పోటీ చేస్తే తమ గెలుపు కష్టమవుతుందని ఇన్ని రోజులు కష్టపడి డబ్బులు ఖర్చు చేసుకుంటే రెబల్స్ గా ఉంటే ఓటమి చవిచూడాల్సి వస్తుందని పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ పార్టీ సీనియర్ నేతల ముందు మొరపెట్టుకుంటున్నారు. మరోసారి అవకాశం ఇద్దాం కానీ ఈసారి ఉపసంహరించుకోవాలి అనే విధంగా పార్టీ సీనియర్ నేతలకు పార్టీ అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ నేతలు సైతం రెబెల్స్ ఉంటే పార్టీ అభ్యర్థులు గెలవడం కష్టంగా మారుతుందని రెబెల్స్‌ను బుజ్జగించి ఉపసంహరిం చుకునేలా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
నాలుగు మున్సిపాలిటీలో అదే తీరు
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి బిచ్కుంద మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ మాత్రం ఒక్కరికే బీఫామ్ ఇవ్వనుండడంతో మిగతా అభ్యర్థులు పోటీ చేయకుం డా విత్ డ్రా చేసుకునేలా సీనియర్ నేతలతో ఒత్తిడి చేయిస్తున్నారు. కొంతమంది రెబెల్స్ అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడానికి ససమేరా అంటున్నారు. పార్టీ కోసం పని చేస్తే బీఫామ్ ఇవ్వకుండా విత్ డ్రా చేసుకోవడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.