02-02-2026 12:00:00 AM
బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ -2026 ను ప్రజల వరకు చేరవేసేందుకు ‘కేంద్ర బడ్జెట్ ప్రచార్ అభియాన్ -2026 బడ్జెట్ వికసిప్ బడ్జెట్‌గా బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ‘బడ్జెట్ -2026‘ ప్రత్యక్ష ప్రసారాన్ని రాష్ట్ర ఇంచార్జి అభయ్ పాటిల్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వపురం లక్ష్మీ నర్సయ్య మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి సమగ్రతగా రైతుల సంక్షేమ కోసం ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, పుల్లారావుతో పాటు జిల్లా, మండల, పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు వీక్షించారు.