05-10-2025 12:02:58 PM
ముంబై: షిర్డీలోని సాయిబాబాని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటి సీఎం ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ లతో కలిసి షిర్డీ సాయి ఆలయానికి చేరుకుని దర్శించుకున్నారు. సాయిబాబా ఆలయంలో అమిత్ షా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంట మహారాష్ట్రం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటి సీఎం ఏకనాథ్ షిండే, అజిత్ పవార్, చంద్రశేఖర్ బవాన్‌కులే, పంకజా ముండే ఉన్నారు.
అమిత్ షా అహల్యానగర్ జిల్లా షిర్డీ పట్టణంలోని ఒక హోటల్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లతో శనివారం రాత్రి దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారని బిజెపి వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ సమావేశంలో మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన పంట నష్టాలు, బాధిత రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అవసరం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, కీలకమైన పరిపాలనా విషయాలపై వారితో కేంద్ర హోంమంత్రి సమీక్షించారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో అనేక జిల్లాల్లో వ్యవసాయ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో తక్షణ ప్రభుత్వ సహాయం కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు గణనీయమైన సహాయ ప్యాకేజీని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.