calender_icon.png 23 February, 2026 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13 జీపీల వార్డ్ మెంబర్లకు పంచాయతీ రాజ్ చట్టంపై శిక్షణ

23-02-2026 07:36:32 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ రైతువేదికలో 13 గ్రామ పంచాయతీల వార్డ్ మెంబర్లకు మొదటి విడతగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లకు నూతన పంచాయత్ రాజ్ చట్టం 2018లోని ముఖ్యమైన అంశాలను అందులో పొందుపరిచిబడిన అంశాలను వివరించడం జరిగింది. చట్టంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, కార్యదర్శులు తీసుకోవాల్సిన విధులు బాధ్యతతో పాటు కొత్త పాత పంచాయతీరాజ్ చట్టాలకు ఉన్న తేడా గ్రామపంచాయతీ గ్రామసభ నిర్వహణ ప్రణాళికలు ఏ విధంగా తయారు చేసుకోవాలి.

విధులను ఏ విధంగా వినియోగించుకోవాలి. గ్రామ పంచాయతీలకు 2030 సంవత్సరం వరకు ప్రతి గ్రామ పంచాయతీని ఎలా ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుకోవాలో అనే అంశాలను నలుగురు పిఓటిలతో తేదీ 23 నుండి 27 వరకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రకాష్, మాస్టర్ ట్రైనర్, కార్యదర్శులు పాల్గొన్నారు.