14 April, 2026 | 9:08 PM

నిరుపయోగంగా ఉన్న వాహనాలు గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలింపు

23-02-2026 07:51 PM

డిప్యూటీ కమిషనర్ శైలజ

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి నగర పాలక సంస్థ కమీషనర్ ఆదేశాల మేరకు బోడుప్పల్ సర్కిల్ పరిధిలో 100 రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగముగా  సోమవారం రోడ్ల పక్కన పడి వున్న పాడైపోయిన వాహనాములను ట్రాఫిక్ పోలీస్  సహాయముతో గుర్తించడం జరిగినది.

అనంతరం  గుర్తించిన 10 పాడై పోయి రోడ్డు పక్కన ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న కాలనీలలోని విడిచిపెట్టబడిన నిరుపయోగంగా వున్న వాహనములను డిప్యూటీ కమీషనర్  ఎ.శైలజ, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తో కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది. ఈ  కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్  ప్రవీణ్  కుమార్, ట్రాఫిక్ పోలీస్  సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.