calender_icon.png 23 February, 2026 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4th పోలీస్ స్పోర్ట్స్-మీట్‌లో జిల్లా పోలీసుల ఉత్తమ ప్రదర్శన

23-02-2026 07:24:30 PM

తెలంగాణ రాష్ట్ర 4th పోలీస్ స్పోర్ట్స్-మీట్‌లో జిల్లా పోలీసుల ఉత్తమ ప్రదర్శన

19 పతకాలతో (06-గోల్డ్, -06 రజతం,07-కాంస్యం) సత్తా చాటిన జిల్లా పోలీస్ క్రీడాకారులు

క్రీడాకారులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): గత వారం రోజులుగా సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 19 పతకాలు (06-బంగారు, 06-రజత, 07-కాంస్య) సాధించి జిల్లాను ముందు వరుసలో నిలిపారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజేతలకు పతకాలు అందజేసిన ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

గెలుపోటములు సహజమని, విజేతలు జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేయాలని, ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా తమ లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలని సూచించారు.జిల్లాకు పతకాలు తీసుకువచ్చిన క్రీడాకారులందరిని ప్రత్యేకంగా అభినందించారు. టేబుల్ టెన్నిస్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ రజత పతకాన్ని సాధించారు. 

45 సంవత్సరాల పైన బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ రజత పతకాన్ని సాధించారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఇ.శ్రీనివాస్ నాయక్ బాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారు. పాల్వంచ సిఐ కే.సతీష్ టెన్నిస్ టీం విభాగంలో రజత పతకాన్ని సాధించారు. వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు టెన్నిస్ డబుల్స్ విభాగంలో రజత పతకాన్ని సాదించారు. కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిసున్న బి.రత్నకుమారి నాలుగు పతకాలను సాధించినది.

మహిళల బాక్సింగ్ విభాగంలో బంగారు పతకం,ట్రేడిషనల్ యోగా విభాగంలో బంగారు పతకం,జిమ్నాస్టిక్స్ విభాగంలో రజతం, కళాత్మక యోగా విభాగంలో ఒక కాంస్య పతకం సాధించారు. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రవీణ్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో బంగారు పతకం,మిక్సడ్ డబుల్స్ విభాగంలో రజత పతకాన్ని సాధించారు. జిల్లా ఏఆర్ విభాగంలో విధులు నిర్వర్తిసున్న మహిళా పోలీసు కానిస్టేబుల్ డి.సుష్మ 100 మీటర్లు,200 మీటర్లు పరుగు పందెం విభాగాలలో బంగారు పతకాలు సాధించారు.

చంద్రుగొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న బి.రజని ఖోఖో,రిథమిక్ యోగా విభాగాలలో 02 కాంస్య పతకాలు సాధించారు. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ వి.వంశీ 100 మీటర్లు,200 మీటర్ల పరుగు పందెం విభాగాలలో 02 కాంస్య పతకాలను సాధించారు. అశ్వాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగస్వరూప బ్యాడ్మింటన్ మిక్సడ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం,విమెన్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించారు.