calender_icon.png 23 February, 2026 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో రాష్ట్ర స్థాయికి ఎంపిక

23-02-2026 06:59:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): జేవిఎన్ఆర్ పాఠశాల శాంతినగర్లో జిల్లా విద్యాశాఖ మరియు ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో  9  జిల్లాస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న గారు హాజరయ్యారు.

టాలెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని, కఠినతరమైన అంశాలపైన నైపుణ్యత వస్తుందని, చిన్నతనం నుంచే జీవితంలో సైన్స్ ను అలవర్చుకోవాలని DEO అన్నారు. 19 మండలాల నుంచి 57 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉర్దూ మీడియం నుంచి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించడం జరిగింది. 10 పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు...

 రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు 

1.Sk అద్నన్, ZPSS తానూర్ 

2.R. నందిని, ZPSS గర్ల్స్ ఖానాపూర్ 

3.మహావీష్, ZPSS నర్సాపూర్ G.

ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ గారు, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నారాయణ వర్మ,బచ్చు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కూన రమేష్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రఫీక్ గారు సంఘ బాద్యులు వందన, దేవేందర్, నభి, faizoddin, సుధాకర్ గారు పాల్గొన్నారు.