calender_icon.png 23 February, 2026 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరసింహ స్వామి కళ్యాణ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఐటీడీఏ పీవో రాహుల్

23-02-2026 07:46:28 PM

భద్రాచలం,(విజయక్రాంతి): శ్రీ జ్వాల లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభు తిరు కళ్యాణ మహోత్సవాలకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ను ఆహ్వానించడం జరిగిందని శ్రీ జ్వాలా లక్ష్మీనరసింహ ఆలయం పూజారి పూలబోయిన రవితేజ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చాంబర్లో శ్రీ జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభు తిరుపతి కళ్యాణ మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు వాల్పోస్టర్ను పిఓ చేత విడుదల చేయడం జరిగిందన్నారు. కరకగూడెం మండలం బుద్ధారం గ్రామంలో మార్చి మూడో తేదీ నుండి 8 తేదీ వరకు జరుగునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా చైతన్య శక్తి నాయకురాలు కొండ్రు సుధారాణి,  వీసాల కృష్ణయ్య, ఆదివాసి యువ నాయకులు ఇర్పా శీను తదితరులు పాల్గొన్నారు.